13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

గ్రామస్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పారుపల్లి సర్పంచ్ సంపత్

23-03-2026 12:46 AM
  1. శాత్రాజ్ పల్లి లో బోరు వేయించిన సర్పంచ్... 

ప్రారంభించిన మాజీ జెడ్పిటిసి జగన్ మోహన్ రావు

ముత్తారం మార్చి 22 (విజయక్రాంతి) ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శాత్రాజ్ పల్లి లో సర్పంచ్ చొప్పరి సంపత్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. శాత్రాజ్ పల్లి లో గిరిజన బిడ్డలు గత కొన్ని సంవత్సరాల నుండి మానేరు వాగు ఉపొంగడం వ ల్ల నీరు లేక ఇబ్బంది పడుతున్నారని, ప్రతి ఎండాకాలంలో బోరులో నీళ్లు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతుండగా గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గ్రామ సర్పంచ్  ఆదివారం బోరు వేయించారు. ఈ బోరును ముత్తారం మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావు కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోరు లో నీళ్ళు బ్రహ్మాండంగా వచ్చాయని, దీంతో శాత్రాజ్ పల్లి ప్రజలు సంతోషం వ్యక్తం చెయ్యడం జరిగిందని, గ్రామ ప్రజల కళ్ళలో ఆనందం కనబడుతుందని అన్నారు. గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం సర్పంచ్ బో రు వేయించి మాట నిలబెట్టుకున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోడ శ్యామల బాపు, వార్డ్ సభ్యులు ముంజం అంజయ్య, ముంజం మల్లయ్య, గట్టయ్య, శ్రీకాంత్, శంకర్, అశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.