23 July, 2026 | 1:51 AM

ప్రమాదంలో పోగొట్టుకున్న నగదును అందజేసిన పసరా ఎస్‌ఐ

23-07-2026 12:00 AM

గోవిందరావుపేట, జూలై 22 (విజయ క్రాంతి)ప్రమాదంలో కిందపడి గాయపడిన వ్యక్తి కోల్పోయిన నగదును తిరిగి పసరా ఎస్‌ఐ తాజుద్దీన్ బాధితుడికి బుధవారం అసరా పోలీ స్ స్టేషన్లో నగదును అందజేశారు. వివరాల్లోకి వెళితే కన్నాయిగూడెం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సోయం వీరబాబు సొంత పనిమీద మండలంలోని ఎల్బీనగర్ గ్రామానికి ద్విచక్ర వాహనంపై కొద్దిరోజుల క్రితం వచ్చాడు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి కింద పడగా వీరబాబు గాయపడగా అత్యవసర చికిత్స కోసం బాధితుడుని అంబులెన్స్ లో తరలించారు.

ఈ క్రమంలో బాధితుడు దగ్గర ఉన్న నగదు 9700 సంఘటన స్థలంలోనే కోల్పోవడం జరిగింది. విషయం తెలుసుకున్న పసరా ఎస్‌ఐ తాజుద్దీన్ తోపాటు విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మధుకర్ గాయపడిన బాధితుడు కోల్పోయినబినగదును భద్ర పరిచి తిరిగి విచారణ చేపట్టడంతో పాటు బాధితులను పిలిపించి కోల్పోయిన నగదును అప్పగించారు. దీంతో బాధితుడు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నగదును భద్రపరచడమే కాకుండా తిరిగి బాధితుడికి పోలీసులు అందజేయడం పట్ల ఎస్‌ఐ పనితీరును మెచ్చుకుంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు శాంతిభద్రతలను పరిరక్షిస్తూనే మరోవైపు మానవతా దృక్పథాన్ని చాటి చెప్తున్నా పోలీసుల సేవా గుణానికి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు