05-12-2025 10:14:01 AM
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో(Shamshabad Airport) ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానాల రాకపోకలు రద్దు అయ్యాయి. మొత్తం 92 విమానాలు రద్దు చేసినట్లు ఇండిగో విమాన సంస్థ వెల్లడించింది. శంషాబాద్ కు రావాల్సిన 43, వెళ్లాల్సిన 49 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. విమాన సర్వీసులు రద్దుపై ముందుగా టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెక్ ఇన్ తర్వాత విమానాల రద్దు సమాచారంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు రోజులుగా తన నెట్‌వర్క్, కార్యకలాపాలలో విస్తృతమైన అంతరాయాల తర్వాత ఇండిగో(IndiGo flight cancellation) ప్రయాణికులకు హృదయపూర్వక క్షమాపణలు చెప్పింది. శుక్రవారం వివిధ విమానాశ్రయాలలో 400కి పైగా ఇండిగో విమానాలను రద్దు అయ్యాయి. విమానాలు ఆలస్యం కావడంతో వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో బయలుదేరే, రాకపోకలు సహా 220కి పైగా విమానాలు రద్దు చేయగా బెంగళూరు విమానాశ్రయంలో 100కి పైగా విమానాలు రద్దు చేయబడ్డాయని ఇండిగో వర్గాలు తెలిపాయి.