calender_icon.png 5 December, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షోభంలో ఇండిగో!

05-12-2025 01:21:10 AM

  1. ఓ వైపు సాంకేతిక లోపాలు.. మరో వైపు సిబ్బంది కొరత.. ఇంకో వైపు బాంబుల బెదిరింపులతో సతమతం
  2. తాజాగా మదీనా - హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు
  3. మూడో రోజు నిలిచిన విమానయాన సంస్థ సేవలు
  4. దేశవ్యాప్తంగా వందలాది విమాన సర్వీసులు రద్దు
  5. విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు
  6. ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు
  7. విమానాల రద్దుపై వివరణకు డీజీసీఏ ఆదేశం

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 3: దేశంలోని అతిపెద్ద బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఓ వైపు బాంబు ల బెదిరింపులు.. మరో వైపు సిబ్బంది కొరత, ఇంకోవైపు సాంకేతిక లోపాల కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరుసగా మూడో రోజైన గురువారం కూడా దేశవ్యాప్తంగా పలు విమా నాశ్రయాల్లో పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఇండిగో కార్యకలాపాలు స్తంభించాయి.

గురువారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 30కి పైగా విమానాలు, హైదరాబాద్‌లో సుమారు 33 విమానాలు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా 200కు పైగా ఇండిగో విమానాలు రద్దు చేశా రు. దీని ఫలితంగా విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం కూడా నాలుగు ప్రధాన నగరాల్లో కలిపి దాదాపు 200 సర్వీసులను నిలిపివేశారు.

ప్రయాణికులకు క్షమాపణ 

విమానాల రద్దుపై ఇండిగో స్పందించింది. తమ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిందని అంగీకరిస్తూ, ప్రయాణికులకు క్షమాప ణలు చెప్పింది. ఊహించని కార్యాచరణ సవా ళ్లు, సాంకేతిక లోపాలు, శీతాకాలం షెడ్యూల్ మార్పులు, సిబ్బంది రోస్టరింగ్‌కు సంబంధించిన కొత్త నిబంధనలు  వంటి అనేక కారణాలు తమ కార్యకలాపాలపై ప్రభావం చూపాయని ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రాబోయే 48 గంటల పాటు షెడ్యూళ్లలో సర్దుబాట్లు చేస్తున్నామని, త్వరలోనే సేవలను సాధారణ స్థితికి తీసుకొస్తామని పేర్కొంది.

రంగంలోకి డీజీసీఏ

ఈ పరిణామాల నేపథ్యంలో, విమానయా న నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రంగంలోకి ది గింది. విమానాల రద్దుకు గల కారణాలపై పూ ర్తి నివేదిక సమర్పించాలని, ప్రయాణికుల ఇ బ్బందులను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఇండిగోను ఆదేశించింది. ఈ అంశంపై చర్చించేందుకు గు రువారం సంస్థ అధికారులను సమావేశానికి పిలిచింది. 

  1. మొన్న కువైట్.. నేడు సౌది 
  2. హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానాలకు బాంబు బెదింపులు

మొన్న కువైట్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఇండిగో విమానంలో మానవ బాంబు ఉందంటూ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఉన్నతాధికారులకు ఈ మెయిల్ ద్వారా సందేశం పంపిన దుండగులు తాజాగా సౌదిలోని మదీనా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానంలో కూ డా బాంబు ఉందంటూ బెదిరించారు.

దీంతో ఆ విమానాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. బాంబు స్కా డ్‌తో తనిఖీలు చేపట్టారు. అయితే, విమానంలో పేలుడు పదార్థాలు లేకపోవడం తో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ విమానంలో 180 మంది ప్రయాణికు లు, ఆరుగురు సిబ్బంది ఉన్నాట్లు విమానయాన సంస్థ అధికారులు తెలిపారు.