1 July, 2026 | 7:40 PM

Breaking News

కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •  

రామచంద్రాపురంలో ఇఫ్తార్ విందు

21-03-2025 10:42 PM

పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు: రామచంద్రాపురం ఈద్గా వద్ద శుక్రవారం ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పటాన్‌ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఇఫ్తార్ విందును 112 డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈశ్వర్ సింగ్, నాయకులు నరేష్ ముదిరాజ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షలు విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, స్థానిక ప్రముఖులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు