calender_icon.png 20 November, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అండర్-17 క్రికెట్ జట్టుకు పటాన్చెరు విద్యార్థి ఎంపిక

20-11-2025 06:33:41 PM

పటాన్ చెరు: ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-17 క్రికెట్ జుట్టుకు పటాన్చెరు పట్టణానికి చెందిన విద్యార్థి ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 69వ క్రీడలలో భాగంగా అండర్-17 ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు బుధవారం సాయంత్రం మెదక్ పట్టణంలో నిర్వహించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఏపీఆర్ కాలనీకి చెందిన ప్రభాకర్ రెడ్డి కుమారుడు శ్రీజన్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శ్రీజన్ తండ్రి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపికవడం చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్న లక్ష్యంతో వారికి శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. సాహిల్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తున్నామని వారు తెలిపారు.