20-11-2025 06:27:03 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..
హసన్ పర్తి మండలం చింతగట్టులో తుది దశ నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్
హనుమకొండ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం చింతగట్టులో జనగాని సంధ్యారాణి, రాజ్యలక్ష్మి అనే లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా అధికారులతో కలిసి కలెక్టర్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరికృష్ణ, తహసిల్దార్ కిరణ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.