20-11-2025 06:36:44 PM
ప్రతిభ కనబర్చిన 10 మంది విద్యార్థులకు ఉచిత విద్య..
హనుమకొండ (విజయక్రాంతి): హన్మకొండ నయీమ్ నగర్ మోషన్ ఐఐటీ, నీట్ జూనియర్ కాలేజీలో ఈ నేల 23న జరిగే మోషన్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ పోస్టర్ ను కాలేజీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ గురువారం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్బంగా వేణు గోపాల్ గౌడ్ మాట్లాడుతూ ఐఐటి, నీట్ కోచింగ్ కు దేశంలోనే అగ్రగామి విద్య సంస్థ అయిన రాజస్థాన్ కోటా మోషన్ ఐఐటీ, నీట్ కాలేజీ ఈ నేల 23న దేశవ్యాప్తంగా మోషన్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుందని, ఈ టాలెంట్ టెస్ట్ ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ అర్హులని అన్నారు. దేశవ్యాప్తంగా మోషన్ టాలెంట్ సెర్చ్ టెస్ట్ వ్రాసే విద్యార్థులలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన 500 మంది విద్యార్థులకు ఉచిత విద్య, రూ. 2.50 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు తెలిపారు.
అలాగే మోషన్ ఐఐటీ, నీట్ వరంగల్ సెంటర్ నుండి కూడా మోషన్ టాలెంట్ టెస్ట్ లో మొదటి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు మొదటి ర్యాంక్ విద్యార్ధికి ల్యాబ్ టాప్ రెండవ ర్యాంక్ సాధియించిన విద్యార్ధికి టాబ్ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. కావున ఈ మంచి అవకాశాన్ని ఈ సంవత్సరము 10వ తరగతి చదువుతున్న స్టేట్, సిబిఎస్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. టాలెంట్ టెస్ట్ రిజిస్ట్రేషన్ కోసం 9703000850/851/852 సెల్ నెంబర్లకు గాను మోషన్ ఐఐటీ, నీట్ ఇన్స్టిట్యూట్ నయీమ్ నగర్, హన్మకొండ నందు సంప్రదించగలరని వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో మోషన్ కాలేజీ డైరెక్టర్ పెరుమాండ్ల అనిల్ గౌడ్, బ్రాంచ్ హెడ్ ముత్యాల సురేష్, ఏజీఎం శనిగరపు సుమన్, ఏవో తాళ్లపెల్లి రమేష్, పాక నాగరాజు, రచ్చ కుమార్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు సురేందర్, తాళ్లపెల్లి వెంకట్, రావుల రవీందర్, ఒంటెరు మనోహర్, బోడ సంతోష్, జి. అనిల్, రంజిత్, కాలేజీ సిబ్బంది లక్ష్మణ్, మౌనిక, ఉమ తదితరులు పాల్గొన్నారు.