లేబర్ కోడ్స్‌తో దేశాభివృద్ధికి బాటలు
- చట్టాలు కార్మికుల జీవితాల్లో మార్పులు తేవాలి
మాజీ గవర్నర్ దత్తాత్రేయ
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): లేబర్ కోడ్స్ దేశ అభివృద్ధికి బాట లు వేసే సంస్కరణలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. దేశంలోని కార్మిక చట్టాల చరిత్రలో ఒక గొప్ప సంస్కరణగా మోదీ ప్రభుత్వ లేబర్ కోడ్స్ నిలుస్తోం దని, గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు ప్రధాన లేబర్ కోడ్స్‌గా రూపొందించడమనేది కార్మికుల సంక్షేమ దృష్ట్యా తీసుకున్న కీలక నిర్ణయమని ఆదివాకరం ఒక ప్రకటనలో తెలిపారు.
అసంఘ టిత రంగం, గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫార్మ్ వర్కర్లు వంటి వర్గాలు ఈ కార్మిక చట్టాలతో రక్షణ పొందనున్నారని చెప్పారు. వేతనాల్లో పారదర్శకత, సమయానుకూల సవరణలు, కార్మి కుల జీవన ప్రమాణం మెరుగుపడే దిశగా మార్పులు చేశారని పేర్కొన్నారు. మహిళా కార్మికుల భద్రతకు ప్రత్యేకప్రాధాన్యం ఇచ్చే లా నిబంధనలు తెచ్చారని తెలిపారు.






