28-04-2025 12:00:00 AM
పంజరం తెరిచి చానాలైనా
గూటిలో పక్షులు
ఎగరటం లేదు!
పచ్చని పైరుపైకి కనిపిస్తున్న
నేలలో నెత్తురు తడి
ఇంకా ఆరటం లేదు!
శవాల కంపుని మోస్తున్న గాలి
శుద్ధి చేసుకుని
ఇంకా పునీతురాలు కాలేదు!
పరాయి దొంగలను
తరిమి కొట్టారు కానీ
ఇంటిదొంగకు దారి చూపారు!
ఎన్నో ఎర్ర మందారాలు
మొగ్గ తొడిగాయి
రాలిపోయాయి.. కానీ
బతుకుల్లో ఇంకా
చీకటిని తరిమే
వెలుగు రేఖలు
ఉదయించటం లేదు!
కన్నీళ్లు తుడుచుకోలేని చేతులు
ప్రణమిల్లి మొక్కటం నేర్చుకొని
ఆత్మను చంపేసి
ఆటబొమ్మలుగా
మారిపోయారు !!