calender_icon.png 4 May, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టి పై మమకారం

28-04-2025 12:00:00 AM

పంట పండించే భూమి పనికి రానట్టు 

నీటితో నిండిన నేలకు ఉనికి లేనట్లు

మిగిలిన నేలలో వాయు కాలుష్యం 

ఇంకా మిగిలితే ధ్వని కాలుష్యం 

పరిశ్రమలు, ప్లాస్టిక్కులు

నేలంత వ్యర్థాలే పెరుగుతున్న తరుణమిది

భూమాత వేదనకు బాధ్యులం

ధరిత్రి దుఃఖానికి కారకులం 

మానవ తప్పిదాలకు మరణ శాసనం రాసి 

మట్టిపై మమకారం పెంచుకుందాం 

మన అవసరాలను తీర్చుకుందాం.