21-02-2026 12:12:35 AM
సర్పంచ్ భర్త అధికార దుర్వినియోగం!
ముత్తారం, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ము త్తారం మండలంలోని ఓడేడ్ గ్రామంలో సర్పంచ్ భర్త అధికార దుర్వినియోగం చేశాడు. సర్పంచ్ పొతిపెద్ది కవిత భర్త కిషన్‌రెడ్డి శుక్రవారం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమంలో సర్పంచుకు బదులు పాల్గొన్నాడు. అంగన్వాడి కేం ద్రంలోని కోడిగుడ్లను హాజరు పట్టికను బాలమృతాన్ని పరిశీలించారు. అనంతరం చిన్నారులకు అక్ష రాభ్యాసం, అన్న ప్రసన్న చేశారు. సర్పంచుకు బదు లు భర్త ప్రభుత్వ పథకంలో పాలుపంచుకోవడంపై గ్రామ ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు.