30-09-2025 12:28:42 PM
శ్రేష్టను అభినందించిన వివిధ పార్టీల నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు
ఎల్లారెడ్డిపేట, (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పాటి దేవయ్య శోభ పెద్ద కూతురు పాటి శ్రేష్ట ఐ సి డి ఎస్ ఎక్స్టెన్షన్ గ్రేడ్ వన్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించింది. గత ఏడాది జరిగిన గ్రూప్ 4 ఫలితాలలో మున్సిపల్ వార్డు ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదవాలనే తపనతో చదివి ఐసిడిఎస్ ఎక్స్టెన్షన్ గ్రెడ్ వన్ ఆఫీసర్గా ఉద్యోగం రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రేష్ట ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఐసిడిఎస్ లో ఉద్యోగం సాధించి తల్లి తండ్రులకు మంచి పేరు తీసుకురావడంతో గొల్లపల్లి గ్రామ ప్రజలు, పలువురు మండల అధికారులు వివిధ పార్టీల నాయకులు శ్రేష్టను అభినందించారు,