30-09-2025 10:53:44 AM
ఇల్లందు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని స్థానిక జగదాంబ సెంటర్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న దుకాణంపై సోలార్ ప్లేట్స్ అమర్చడానికి వచ్చిన రామాంజనేయులు అనే వ్యక్తికి కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. రామాంజనేయులు గతంలో సహారా కంపెనీలో మేనేజర్ గా పని చేశాడు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.