calender_icon.png 30 September, 2025 | 2:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ

30-09-2025 01:10:40 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం డిసిపి కరుణాకర్ తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎంపీటీసీ, జేడ్పీటీసీ, గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందన్నారు.

రెండు విడతలలో స్థానిక సంస్థలను, 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని, జిల్లాలో మొదటి విడతలో 7 మండలాలు, రెండవ విడుదల ఆరు మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల జరుగుతాయి.  పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని,  సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ అదనపు భద్రత బలగలు ఉండేలా చూడాలని, ఎన్నికల షెడ్యూల్ విడుదల జరిగిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి వెంటనే ఎన్నికలు జరిగే గ్రామీణ ప్రాంతాలలో అమలులోకి రావడం జరుగుతుంది.

ఎం.సి.సి నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలను చేపట్టీ మండల అధికారులు రిపోర్ట్ అందించాలని, ఓటర్లను ప్రభావితం చేసేలా ఎంసిసి నిబంధనలకు విరుద్ధంగా అర్బన్ ప్రాంతాలలో, సోషల్ మీడియా ద్వారా ఉల్లంఘనలు చేస్తే వారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్దం చేశామని, సిబ్బందికి ఎన్నికల విధుల నిర్వహణ పట్ల శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలి. శాంతి భద్రతలు కూడా అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, పౌలింగ్ కేంద్రాలను పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన వసతులు ఉన్నాయో లేదో చెక్ చేయాలని, పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయించాలి.

 మండల కేంద్రాలలో నామినేషన్ స్వీకరణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని, నామినేషన్ల స్క్రూటిని, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియపై  సిబ్బందికి శిక్షణ అందించాలని అన్నారు. పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనల, విధులపై అధికారులకు ముందుగానే సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. పోటీలో ఉండే అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత బ్యాలెట్ పేపర్ల ముద్రణ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన వాహనాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ఒక నోడల్ అధికారి నియమించాలని అన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా రి -పోల్ జరగకుండా పటిష్ట ఏర్పాట్లు ఉండాలన్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు: పెద్దపల్లి డిసిపి కరుణాకర్

స్ట్రాంగ్ రూమ్, నామినేషన్ సెంటర్, పోలింగ్ కేంద్రాల వద్ద  అవసరమైన మేర పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పెద్దపల్లి డిసిపి కరుణాకర్ అన్నారు. అక్టోబర్ 9 నోటిఫికేషన్ విడుదల చేసిన దగ్గర నుంచి ఎస్.ఎఫ్.టి పని చేసేలా చర్యలు చేపట్టామని, గోదావరిఖని లోని ప్రభుత్వ డిగ్రీ & పీజి కళాశాల,  మదర్ థెరిసా ఇంజనీరింగ్ కళాశాల వద్ద అవసరమైన చర్యలు తీసుకుంటామని, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమంగా డబ్బు, మద్యం రవాణా చేస్తే  తనిఖీలు చేపట్టే ఫీజ్ చేయడం జరుగుతుందని, రెవెన్యూ శాఖ అధికారులతో సమయంతో ఎన్నికల జరిగిందని,  అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు.