30-09-2025 11:20:17 AM
వాషింగ్టన్: సినిమాలపై(Films) అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) సుంకాల మోత మోగించారు. అమెరికా వెలుపల నిర్మించిన సినిమాలపై 100శాతం భారీ సుంకం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. గత మూడు నెలలుగా, అంతకు మించి ఆయన ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న భారతదేశానికి మరో పెద్ద దెబ్బగా మారింది. ట్రంప్ నిర్ణయం భారీతీయ చిత్ర పరిశ్రమపై తీవ్రప్రభావం పడింది. దీంతో టాలీవుడ్ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం భారీగా కోల్పోతామని అంచనా వేస్తున్నారు.
భారతీయ భాషల చిత్రాలు అమెరికా, కెనడాలో భారీగా ప్రదర్శితమవుతున్నాయి. పెద్ద సినిమాల్లో ఒక్కోక్కటి సగటున 80 లక్షల డాలర్లు వసూళ్లు రాబడుతున్నాయి. అమెరికాలో 1000 స్క్రీన్లలో ఇండియన్ సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి. కొన్ని చిత్రాలు కోటి డాలర్లు వసూలు చేసిన సందర్భాలున్నాయి. అమెరికాలో చిత్రాలకు గతంలో ప్రపంచవ్యాప్తంగా భారీగా ఆదరణ ఉండేది. భారతీయ చిత్రాలకు భారీగా గుర్తింపు రావడంతో హాలీవుడ్ చిత్రాలకు క్రేజ్ తగ్గిపోయింది. అటు ట్రంప్ నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోవాలని టాలీవుడ్ చిత్ర నిర్మాతలు కోరుతున్నారు. భారత్ పై వివిధ అంశాలపై మరిన్ని సుంకాలు విధిస్తామని బెదిరించిన డొనాల్డ్ ట్రంప్, తన హామీని నిలబెట్టుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.