30-09-2025 01:22:21 PM
హైదరాబాద్: భారత స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ(Tilak Varma Press Meet) తను శిక్షణ పొందిన లింగంపల్లి తేగల క్రికెట్ అకాడమీని మంగళవారం నాడు సందర్శించారు. ఆసియా కప్ హీరో తిలక్ వర్మను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. గ్రౌండ్ లో శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో తిలక్ వర్మ కరచాలనం చేశారు. చాలా ఒత్తిడిలోనే బ్యాంటింగ్ చేశానని, దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే ఆడానని తిలక్ వర్మ(Tilak Varma) మీడియా సమావేశంలో పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ తనకు ఎంతో స్ఫూర్తినిచ్చారని, కోహ్లీతో తనను పోల్చడం గర్వంగా అనిపిస్తోందన్నారు. భారత జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారని, ఆసియా కప్ ఫైనల్ గెలవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఒత్తిడిలో కూడా తమ కళ్ల ముందు దేశమే కనిపించిందన్నారు.
అందరం కలిసి గెలుపు కోసం కృషి చేశామని తెలిపారు. పాకిస్థాన్ ఆటగాళ్లు చాలా ఒత్తిడికి గురిచేశారు.. అయినా పట్టించుకోలేదని స్పష్టం చేశారు. మ్యాచ్ ను గెలిపించి వారికి జవాబివ్వాలనే ఉద్దేశంతోనే ఆడానన్నారు. తన విజయంలో తల్లిదండ్రులు, కోచ్ దే ప్రముఖపాత్ర అన్నారు. క్రికెట్ కెరీర్ కోసం చిన్నప్పటి నుంచి ఎంతో కృషి చేశానన్న తిలక్ వర్మ ఈ మైదానంలో అనే బ్యాంటింగ్ మెళకువలు నేర్చుకున్నట్లు తెలిపారు. ఆసియా కప్ 2025 ఫైనల్ స్టార్ తిలక్ వర్మ సోమవారం హైదరాబాద్‌లో స్వదేశానికి తిరిగి వచ్చాడు. పాకిస్తాన్‌పై తన మ్యాచ్ విజేత తన ఆటతో భారత్‌ను రికార్డు స్థాయిలో తొమ్మిదో టైటిల్‌కు విజయం వైపు నడిపించిన విషయం తెలిసిందే. రన్ ఛేజింగ్‌లో 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. తిలక్ వర్మను స్వాగతించడానికి శంషాబాద్ విమానాశ్రయం జనాలతో నిండిపోయింది.