23 June, 2026 | 11:43 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

58 జీవోలో సర్వే చేసిన పేదల ఇండ్లకు పట్టాలు ఇవ్వాలి

12-03-2026 12:25 AM

మహబూబాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): 58 జీవోలో అప్లై చేసి సర్వే చేసిన పేదల ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరించి ప ట్టాలిచ్చి, మున్సిపాలిటీ ద్వారా ఇంటి నెం బర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బుధవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా పేదలు నిర్వహించారు. కాలనీల్లో కరెంటు, సైడ్ డ్రైనేజీ, రోడ్లు, మంచినీటి సరఫరా, అంగన్వాడి, ప్రైమరీ స్కూల్ లను ఏ ర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి ప త్రం కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు.

ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మండల వెంకన్న మాట్లా డుతూ పట్టణంలో కూలి పనులు, చిరు వ్యా పారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నిరుపేదలు గత 15 సంవత్సరాల క్రి తం గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తుండగా 58 జీవో ప్రకారంగా కాలనీల్లో పేదల ఇండ్ల స్థలాలను సర్వేలు చేశారని, కొంతమందికి ఎన్నికల ముందు పట్టాలు ఇ వ్వగా మరికొంతమందికి పట్టాలు ఇవ్వలేదన్నారు.

పట్టాలు లేకపోవడం వలన ఇంటి నెంబర్లు కేటాయించకపోవడంతో పేదల ఇండ్లకు రావలసిన కరెంటు సౌకర్యం లేక మంచినీటి సౌకర్యం లేక రోడ్డు డ్రైనేజీ లేక తీవ్ర సతమత మవుతున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. పట్టణంలో పేదలు గుడిసెలు వే సుకున్న సామ పూలక్క నగర్, దొరన్న నగర్, బట్టు అంజయ్య నగర్, ప్రగతి నగర్, మాధవన్న నగర్, పైల వాసు దేవరావు నగర్ కా లనీలలో సర్వే నిర్వహించిన పేదల ఇండ్లకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కా ర్యవర్గ సభ్యుడు హలావత్ లింగన్న, నాయకులు సామ పాపయ్య, పర్వత కోటేష్, కుక్క మూడి యాకయ్య, గుండెల కృష్ణ, కుక్కమూ డి అనిత, శివారపు శారద, అలీ, యాకాంబ రం, కల్పన, తదితరులు పాల్గొన్నారు.