చేవెళ్ల బీజేపీ మున్సిపల్ ప్రధాన కార్యదర్శిగా పత్తి సత్యనారాయణ
జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే రత్నంకు కృతజ్ఞతలు తెలిపిన పత్తి సత్యనారాయణ
చేవెళ్ల జూన్ 18 (విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపల్ బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పత్తి సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ బుధవారం నియామక పత్రం అందజేశారు. అయితే చేవెళ్ల మున్సిపల్ కార్యదర్శిగా గాజులగూడం శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు.
అనంతరం వారు మాట్లాడుతూ... మాపై నమ్మకంతో జిల్లా కార్యవర్గానికి తమను ప్రతిపాదించిన రాజ్ భూ పాల్ గౌడ్, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నంకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో చేవెళ్ల మున్సిపాలిటీ చైర్మన్ కైవసం చేసుకుని బిజెపి జెండా ఎగరవేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశ భద్రత అంశాలు ఇంటింటికి తెలియజేస్తానన్నారు.
తమపై నమ్మకంతో కార్యదర్శి, ప్రధాన కార్యదర్శిగా, నియమించిన జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే. ఎస్ రత్నం నమ్మకాన్ని వమ్ము చేయమన్నారు. బూతు స్థాయి నాయకులను కార్యకర్తలను కలుపుకొని మునుముందు పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తమ నియామకానికి సహకరించిన ప్రతీ కార్యకర్తకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.






