19 June, 2026 | 3:14 AM

నాణ్యమైన భోజనం అందించాలి

19-06-2026 01:40 AM

కలెక్టర్ దీపక్ తివారి

తాండూరు, జూన్ 18 (విజయక్రాంతి): ప్రభుత్వ వసతి గృహాల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సిబ్బందిపై తగు చర్యలు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. గురువారం  ఆయన వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాల పరిసర ప్రాంతాల్లో చెట్లు, ముళ్ళపదలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

అనంతరం డంపింగ్ యార్డ్  సందర్శించి నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని... నూతనంగా నిర్మిస్తున్న మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకు పనులను నాణ్యతతో చేపట్టాలని ఆయన తెలిపారు. శాంతినగర్ పార్కులో చిన్నారులకు వివిధ ఆట పరికరాలను సమకూర్చి అభివృద్ధి పర్చాలని అధికారులకు సూచించారు. గిరిజన, మైనారిటీ బాలికల సంక్షేమ వసతి గృహాలలో వంట గది, నిత్యావసర సరుకుల నిల్వ గదిని పరిశీలించి గడువు తేదీ పూర్తయిన సరుకులను వాడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, హౌసింగ్ డిఈ మహమ్మద్ ఖలీముద్దీన్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.