యాదగిరిగుట్ట దేవస్థానంలో కొనసాగుతున్న పవిత్రోత్సవములు
యాదగిరిగుట్ట దేవస్థానంలో కొనసాగుతున్న పవిత్రోత్సవములు
భక్తుల రద్దీ.... స్వామివారి నిత్య రాబడి రూ. 44,71,561
యాదగిరిగుట్ట, ఆగస్టు 23(విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానంలో రెండవ రోజు ఆదివారం పవిత్రోత్సవములు ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తి లక్ష్మీనరసింహ స్వామి వారి కి తిరుమంజనం, యజ్ఞశాలలో మంటప ద్వారతోరణ పూజ, మూర్తి కుంభారాధన, పవిత్ర ఆరాధన, పవిత్రఅధివాసములు నృసింహ మహాలక్ష్మి సుదర్శన మూలమంత్ర మూర్తి మంత్ర హవనములు, నిత్య పూర్ణాహుతి, మధ్యాన్నం ఆరాధన గోష్టి,సాయంత్రం బంగారు గోపురం సుదర్శన చక్రమునకు షోడశోపచార ఆరాధన పవిత్ర ధారణ యజ్ఞశాల లో నిత్యవిధి మూలమంత్ర హోమములు పూర్ణాహుతి రెండవరోజు కార్యక్రమములు వైభవంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి వేంకటాచార్యులు తెలిపారు. ఆదివారం సెలవు కావడంతో యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ధర్మ దర్శనానికి రెండు గంటలు స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామివారి నిత్య ఆదాయం 44,71,561/- వచ్చినట్లు ఆలయ అధికారి తెలిపారు.






