23 August, 2026 | 8:29 PM

Breaking News

ప్రభుత్వగిరిజన బాలికల హాస్టల్ లో బోనాల పండుగ   •   దమ్మాయిగూడ–నాగారం 100 ఫీట్ల రోడ్డును 80 ఫీట్లకు కుదించాలి   •   యూరియా కొరత లేదు.... రైతులు ఆందోళన చెందొద్దు   •   శ్రీ రామలింగేశ్వర స్వామి, పార్వతీదేవి అమ్మవార్ల ఉపాలయాల ప్రతిష్ఠా మహోత్సవం   •   మానసిక వికలాంగ విద్యార్థులకు భోజన వితరణ   •   అమ్మవార్ల దయ జవహర్ నగర్ ప్రజలపై ఉండాలి   •   మైనార్టీ మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అండ   •   ముత్యాలమ్మకి బోనం సమర్పించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి   •   రోడ్డు ప్రమాద బాధితున్ని పరామర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే   •   సొంత నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం అభినందనీయం: ఎమ్మెల్యే గూడెం   •  

గుడిరేవు గ్రామ సమస్యలను పరిష్కరించాలని వినతి

23-08-2026 07:50 PM

గుడిరేవు గ్రామ సమస్యలను పరిష్కరించాలని సుగుణక్కకు విన్నవించిన ఆదివాసీ పెద్దల వినతి..

ఉట్నూర్, ఆగస్టు 23 (విజయక్రాంతి): ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కుమురంభీమ్ ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క అన్నారు.మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గ్రామానికి చెందిన ఆదివాసీలు, పద్మల్‌పూరీ కాకో ఆలయ ప్రధాన పూజారి కినక బాదిరావు ఆధ్వర్యంలో ఆదివారం ఉట్నూర్‌లోని సుగుణక్క క్యాంపు కార్యాలయంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ప్రధాన పూజారి కినక బాదిరావును సుగుణక్క శాలువాతో సన్మానించారు.గ్రామస్తులు తమ గ్రామంలోని సమస్యలను సుగుణక్క దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో అర్హులైన నిరుపేద కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూస్తానని సుగుణక్క హామీ ఇచ్చారు. పద్మల్‌పూరీ కాకో ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మడావి బగువంత్ రావు,మడావి జోగ్గురావు,గోడం గుణువంత్ రావు,కినక జ్యోతిరావు,మడావి యాదోషావ్,అర్క రాజ్ కుమార్,మడావి పైకు,ఊర్వేత దత్తరం,అర్క రాంషావ్,ఊర్వేత రవీందర్ తదితరులు పాల్గొన్నారు.