23 August, 2026 | 8:25 PM

డీసీసీ అధ్యక్షుని కుటుంబాన్ని పరామర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే

23-08-2026 07:40 PM

నిజాంసాగర్ ఆగష్టు 23(విజయక్రాంతి): కామారెడ్డి డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కుటుంబాన్ని ఆదివారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పరామర్శించారు. ఏలే మల్లికార్జున్ పెద్దనాన్న ఏలే ఏషయ్య కుమారుడు ఏలే ప్రవీణ్ శనివారం మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు భుజం గారి భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు రామ్ రెడ్డి, నిజాంసాగర్ మండల పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి, పిట్లం సర్పంచ్ కుమ్మరి శేఖర్, ఇమ్రోజ్, తదితరులు పాల్గొన్నారు.