23 August, 2026 | 8:07 PM

జాతీయస్థాయి స్పెల్ బీ పోటీల్లో శ్రీవిద్య విద్యార్థులు

23-08-2026 07:32 PM

జాతీయస్థాయిలో తృతీయ బహుమతి కైవసం

పాపన్నపేట,ఆగస్టు23: స్పెల్ బీ జాతీయస్థాయి పరీక్షల్లో పాపన్నపేట శ్రీవిద్య పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రతిభను కనబరిచి తృతీయ స్థాయి బహుమతిని కైవసం చేసుకున్నారు. ఆదివారం హైదరాబాదులో విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి స్పెల్ బీ పోటీ పరీక్షలు నిర్వహించారు.

గత సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం తరఫున ఆదివారం జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో అక్షిత్, శ్రేష్టక్షర, మనోహర్ లు పాల్గొన్నారు. మూడు రౌండ్ లలో ప్రతిభ కనబరిచి శ్రేష్టక్షర తృతీయ బహుమతి సాధించింది. మిగతా ఇద్దరు రెండు రౌండ్ లలో ప్రతిభ కనబరిచారు. జాతీయస్థాయిలో తృతీయ బహుమతి సాధించడంతో పాఠశాల కరస్పాండెంట్ లు నిటలాక్షప్ప, సుమన్, ప్రిన్సిపల్ రవీందర్ గుప్తా, పాఠశాల ఉపాధ్యాయ బృందం వారిని అభినందించారు.