22 June, 2026 | 8:17 PM

డిప్యూటీ సీఎంగా పవన్

15-06-2024 12:47 AM

ఐటీ  మంత్రిగా లోకేశ్

ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించిన చంద్రబాబు 

హైదరాబాద్, జూన్ 14 ( విజయక్రాంతి): రాష్ట్ర మంత్రులకు ఆంధ్రప్రదేశ్ ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాఖలు కేటాయించారు. ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేశ్‌కు హెచ్‌ఆర్‌డీ, ఐటీ, ఆర్టీజీ శాఖలు కేటాయించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయశాఖ కేటాయించారు

మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..

చంద్రబాబునాయుడు: సీఎం, జీఏడీ, శాంతి భద్రతలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు)

కొణిదెల పవన్‌కల్యాణ్: డిప్యూటీ సీఎం, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ.

నారాలోకేశ్: మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ.

కింజారపు అచ్చెన్నాయుడు: వ్యవసాయం, సహకార శాఖ, మార్కెటింగ్, పశుసంవర్థకశాఖ, డెయిరీ డెవలప్‌మెంట్, మత్స్యశాఖ.

కొల్లు రవీందర్: గనులు, అబ్కారీ 

నాదెండ్ల మనోహర్: పౌరసరఫరాలశాఖ

పొంగూరు నారాయణ: మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, అర్బన్ డెవలప్‌మెంట్.

వంగలపూడి అనిత: హోంశాఖ, విపత్తుల నిర్వహణ

సత్యకుమార్ యాదవ్: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ, మెడికల్ ఎడ్యుకేషన్.

నిమ్మల రామనాయడు: జలవనరులు, అభివృద్ధిశాఖ.

ఎన్‌ఎండీ ఫరూక్: న్యాయ, మైనార్టీ సంక్షేమం.

అనం రామనారాయణరెడ్డి: దేవాదాయ 

పయ్యావుల కేశవ్: ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్, ట్యాక్సెస్, శాసనసభా వ్యవహారాలు.

అనగాని సత్యప్రసాద్: రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్.

కొలుసు పార్థసారథి: గృహనిర్మాణం, సమాచారశాఖ.

గొట్టిపాటి రవికుమార్: విద్యుత్‌శాఖ.

కందుల దుర్గేశ్: పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ.

గుమ్మడి సంధ్యారాణి: గిరిజన, మహిళా, శిశుసంక్షేమ శాఖ.

బీసీ జనార్దన్‌రెడ్డి: రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు.

టీజీ భరత్: పరిశ్రమలు, వాణిజ్యం.

ఎస్ సవిత: బీసీ సంక్షేమం, చేనేత, జౌళీ.

వాసంశెట్టి సుభాశ్: కార్మికశాఖ.

కొండపల్లి శ్రీనివాస్: చిన్నతరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు.

మందిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి: రవాణా, యవజన క్రీడలు.