జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్
11-06-2024 11:29 AM
అమరావతి: జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు పవన్ ను ఎన్నుకున్నారు. జనసేన తెనాలి శాసనసభ్యుడు ఎన్ మనోహర్ అసెంబ్లీలో జనసేన ఫ్లోర్ లీడర్‌గా పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించగా, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 175 మంది సభ్యులున్న సభలో జనసేనకు 21 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 164 అసెంబ్లీ స్థానాల (టీడీపీ-135, జనసేన-21, బీజేపీ-8) మెజారిటీతో ఎన్డీఏ ఘనవిజయం సాధించింది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తమ నాయకుడిగా ఎన్డీయే శాసనసభ్యుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.






