పతిపక్ష నేతగా రాహుల్ గాంధీ.. సీడబ్ల్యూసీ తీర్మానం
న్యూఢిల్లీ: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఉండేందుకు రాహుల్ గాంధీని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం తీసుకుంది. శనివారం ఉదయం ఢిల్లీలోని ఆశోక్ హోటల్ లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనిశ్ తిహరీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ... లోక్ సభ నాయకుడిగా రాహుల్ గాంధీనే ఉండాలని తామంతా తీర్మానించమన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా నాయకత్వం వహించడానికి రాహుల్ గాంధీ సరైన వ్యక్తి అని, ఎన్నికల ప్రచారంలో ఆయన కృషిని కూడా సీడబ్ల్యూసీ కొనియాడినట్లు వేణుగోపాల్ చెప్పారు. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోని అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. లోక్ సభ నేతను ఎన్నుకోవడంతో పాటు, ఎన్నికల ప్రచారం, గ్యారంటీలపై కూడా సమావేశంలో చర్చించామన్నారు.






