11 April, 2026 | 6:37 PM

పవన్ కళ్యాణ్ భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

28-06-2024 06:10 PM

జగిత్యాల, (విజయక్రాంతి ): ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు లో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకునేందు కు శనివారం వస్తున్న దృష్ట్యా  భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భద్రత కల్పించేందుకు పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు.  అనంతరం కొండగట్టులో ఏర్పాటు చేసిన ఔట్ పోస్టును సందర్శించి సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. ఎస్పీ వెంట డిఎస్పీ రఘు చందర్, సిఐ రవి ఎస్ఐ రహీం ఉన్నారు.