మన చేతుల్లోనే భవిష్యత్తు : ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి
సమస్య ఏదైనా నా దృష్టికి తెస్తే పరిష్కారిస్తా
ఉచితంగా స్టడీ మెటీరియల్స్ అందిస్తా
మహబూబ్ నగర్: యువత ఇప్పుడు సత్ప్రవర్తనతో అడుగులు ముందుకు సాగితే మీ భవిష్యత్తు బంగారు మయంగా ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అండగా నిలుస్తుందన్నారు. ఇంటర్ విద్య మన భవిష్యత్తుకు పునాది వేసి మన భవిష్యత్తు గమనాన్ని నిర్ణయించే సమయమని ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తు కు బంగారు బాటలు వేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. చెడు అలవాట్లకు, మంచి ప్రవర్తన లేని స్నేహితులకు దూరంగా ఉంటూ మీ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ఏదైనా జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు సూచించారు.




