3 June, 2026 | 12:31 AM

కాంగ్రెస్ లక్ష్యంగానే పవన్ అడుగులు

03-06-2026 12:00 AM
  1. విధ్యేషాలు రెచ్చగొడితే ఊరుకోం
  2. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ 

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగానే పవన్‌కళ్యాణ్ వేస్తు న్న అడుగులను చిత్తు చేస్తామని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. పవన్ రూపం గుర్తు పట్టలేనంత స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని ఆయన హితవు పలికారు. మంగళవా రం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ వెళ్లి నవాబ్ షరీఫ్ తల్లి కాళ్లు మొక్కి మనవరాలు పుట్టిన రోజున బిర్యానీ తిని వచ్చిన మోదీ, పవన్‌కు గురువు అని విమర్శించారు. గద్దర్ పేరు చెప్పి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతున్నట్లు మాట్లా డతున్నారని, అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 11 రోజులు తిండి తినకుండా ఉన్నానని చెప్పిన విషయం మర్చిపోయావా? అంటూ నిలదీశారు.

కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ ప్రజలే కారణమన్నది గుర్తుంచుకోవాలన్నారు.ప్రొఫెసర్ నాగేశ్వరరావు, పాశం యాదగిరి పేరు చెప్పి తెలంగా ణ రాజకీయాల్లోకి వస్తున్న అంటే తాము నమ్మమని అన్నారు. పవన్‌ను తెలంగాణలో ఎవరు అడ్డుకోరని, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకోమని హెచ్చరిం చారు. రాహుల్, ప్రియాంకపై మాట్లాడే స్థాయి పవన్‌కు లేదన్నారు. కాంగ్రెస్ అన్ని మతాలు, కులాలను కలుపుకొని వెళ్లుతోందన్నారు.