19 April, 2026 | 3:24 AM

షబ్బీర్ అలీని కలిసిన పీసీసీ జనరల్ సెక్రటరీ

19-06-2025 01:19 AM

కామారెడ్డి, జూన్ 18,(విజయ క్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని షబ్బీర్ నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేశారు.

టీపీసీసీ సెక్రెటరీగా తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు , ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు  లను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ మాజీ ఛైర్మన్ గడ్డం ఇందుప్రియ, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.