పీసీసీ పనితీరు సంతృప్తికరం
మహేష్ కుమార్ గౌడ్‌కు అభినందనలు
ఏఐసీసీ నేత మీనాక్షి నటరాజన్
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): పీసీసీ అధ్యక్షులుగా మహేష్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం పార్టీ చేపట్టిన సంస్థాగత కార్యక్రమాలు, శిక్షణా కార్య క్రమాలు, ప్రజా ఉద్యమాలపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్, జై బాపు భీమ్, మనగేర కార్యక్రమం, డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరాలు, ఎస్‌ఐఆర్ శిక్షణా కార్యక్రమాలు, బీఎల్‌ఏల నియామకాలు, డీసీసీ కమిటీల ఏ ర్పాటు, మండల కమిటీల నియామకం వం టి కార్యక్రమాలను సమర్థవంతంగా అ మలు చేసినందుకు పీసీసీ అధ్యక్షులు మహే ష్ కుమార్ గౌడ్‌ను ప్రత్యేకంగా ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కనె క్టింగ్ సెంటర్ చైర్మన్ సెంథిల్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ కలిసి పీసీసీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర పీసీసీ కార్యాలయ బృందాన్ని శనివారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో అభినందించారు.
ప్రతి నెల తెలం గాణ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై కార్యాచరణ నివేదికను సిద్ధం చేసి ఏఐసీసీకి పంపిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పీసీసీ అధ్యక్షుల కార్యాలయ ఇన్చార్జ్ ప్రసన్నకుమార్ శర్మ సేవలను ప్రశంసించారు. జూన్ కార్యాచరణ పుస్తకాన్ని పరిశీలించారు. ఎస్‌ఐఆర్, బీఎల్‌ఏ, జనహిత పాదయాత్ర కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు 11 రాష్ట్రాల ఏఐసీసీ నాయకులు, అగ్రనాయకులు అభినందించినట్లు మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.






