19 July, 2026 | 2:59 AM

నర్సింగ్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ కలకలం

19-07-2026 12:44 AM

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘటన

సూర్యాపేట, జూలై 18 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. కాలేజీ హాస్టల్‌లో భోజనం చేసిన అనంతరం 13 మంది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో కళాశాల యాజమాన్యం వెంటనే అప్రమత్తమైంది.

బాధితులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.ఈ ఘటనకు హాస్టల్‌లో అందించిన ఆహారమే కారణమా లేదా మరేదైనా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు.