21 August, 2026 | 11:28 PM

నకిలీలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్

23-05-2024 02:11 AM

కలెక్టర్ రాజరిషా ప్రకటన 

నకిలీ విత్తన విక్రేతలపై పీడీ యాక్ట్ : ఎస్పీ గౌష్ అలం 

ఆదిలాబాద్, మే 22 (విజయ క్రాంతి): నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఆదిలా బాద్ కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయ, పోలీస్‌శాఖ  అధికారులతో ఏర్పాటు చేసే టాస్క్‌ఫోర్స్ బృందాలు రైతులను మోసం చేసే, నకిలీ విత్తనాలను సర ఫరా చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. స్టాక్ రిజిష్టర్, బిల్ బుక్ నిరహణ వంటి చిన్నచిన్న లోపాల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో జిల్లా స్థాయిలో డీఎస్పీ, ఏడీఏ, ఆర్డీవో ఉం టారని, మండల, డివిజన్ స్థాయిలో తహసీల్దార్, ఏవో, సీఐలు ఉంటారని వెల్లడిం చారు. అనంతరం ఎస్పీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో విత్తన, ఎరువుల దుకాణాలను, గోదాములను ఆకస్మికంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. అనుమా నం వచ్చిన విత్తనాల శాంపిల్స్ పరీక్షలకు పంపిస్తామని తెలిపారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసే వారిపై, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే పీడియాక్ట్ అ మలు చేయడానికి వెనుకాడబోమని స్పష్టంచేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలదేవీ, వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, డీఎస్పీ జీవన్‌రెడ్డి, తహసీల్దార్లు, పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు  పాల్గొన్నారు.