18 April, 2026 | 2:18 AM

పీడీఎస్ బియ్యం పట్టివేత

18-04-2026 12:00 AM

15 క్వింటాళ్లు స్వాధీనం

బెజ్జూర్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి):పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన పబ్లిక్ డిస్ట్రి బ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) బియ్యా న్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మర్థిడి గ్రామ పరిసర ప్రాంతాల్లో పహారా నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి తన నివాసంలో అక్రమం గా పీడీఎస్ బియ్యం నిల్వ ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం అందింది.

దీంతో వెంటనే పోలీసులు ఆ ఇంటికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో సుమారు 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం విలువ సుమారు రూ.18 వేలుగా అంచనా వేశారు. విచారణ లో మర్థిడి గ్రామానికి చెందిన వ్యక్తి గ్రామ పరిసర ప్రాంతాల ప్రజల వద్ద నుంచి కిలోకు రూ.12 చొప్పున పీడీఎస్ బియ్యం సేకరించి, మహారాష్ట్ర రాష్ట్రానికి అక్రమంగా తరలించి కిలో కు రూ.20 చొప్పున విక్రయించి లా భం పొందాలని యత్నించినట్లు పో లీసుల విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.