12-11-2025 05:04:00 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం పి.డి.ఎస్.యు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా ఏ.సంజయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా మణికంఠ, ప్రధాన కార్యదర్శిగా బి. శివరాం, సహాయ కార్యదర్శిగా జె.రోహిత్, కోశాధికారిగా ఎమ్.సాయి సాగర్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్, జిల్లా నాయకులు కే. కార్తీక్, వంశీ, అంజి విద్యార్థులు పాల్గొన్నారు.