calender_icon.png 12 November, 2025 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపకార విత్తనాలను విడుదల చేయాలి

12-11-2025 04:59:57 PM

నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించే పెండింగ్ ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ల వద్ద నుంచి వివేకానంద చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి పెండింగ్ బకాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విద్యార్థులకు అందకపోవడంతో ఇబ్బంది గురవుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని జిల్లా అధ్యక్షులు మహేందర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమణ కిరణ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.