11-12-2025 04:38:38 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): ఖానాపూర్ డివిజన్ లోని ఆయా గ్రామాల్లో గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికల పోలింగ్ నిర్వహించగా ఓటర్లు ఉదయం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివచ్చారు. ఉదయం చలి కారణంగా 9 గంటల వరకు మందకోడిగా ప్రారంభమైన ఓటింగ్ ఆ తర్వాత ఊపందుకుంది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు యువతీ యువకులు నిజమైన సేవకులను ఎన్నుకున్నందుకు ఓట్లు వేయడం జరిగిందని పేర్కొన్నారు.