11-12-2025 04:36:58 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఖానాపూర్ డివిజన్ లోని గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం తనిఖీ చేశారు. మామడ లక్ష్మణ చందా ఖానాపూర్ పెంబి దస్తురాబాద్ తదితర మండలంలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన కలెక్టర్.. క్యూలైన్ లో నిలబడ్డ ఓటర్లతో పలకరించి అక్కడ ఉన్న సౌకర్యాలను ఓటింగ్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా సిబ్బంది సహకరించాలని సూచించారు. కౌటింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్న కళ్యాణి అధికారులు ఉన్నారు.