10 April, 2026 | 1:51 AM

రాష్ట్రస్థాయిలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి అవార్డుల పంట

10-04-2026 12:26 AM

పెద్దపల్లిలో విలేకరులతో రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయరమణా రావు 

పెద్దపల్లి, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు అందిస్తు న్న వైద్య సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం  4 అవార్డులు ప్రకటించడం ఎంతో గర్వకారణమని ప్రభుత్వ విప్ పెద్దపెల్లి ఎమ్మెల్యే చింత కుంట విజయ రమణారావు అన్నారు. గురువారం పెద్దపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కా ర్యాలయంలో ఆసుపత్రి సూపరింటెండెం ట్ శ్రీధర్ ను శాలువాతో ఘనంగా విప్ సత్కరించారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూరాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో జిల్లా ఆసుపత్రి అరుదైన మైలురాయిని చేరుకుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పురస్కారాల్లో జిల్లా ఆసుపత్రి అ త్యధిక అవార్డులను సొంతం చేసుకొని రా ష్ట్రంలోనే ఉత్తమ ఆసుపత్రిగా నిలిచిందని తెలిపారు. 

రాష్ట్రంలో అత్యధిక అవార్డు లు పొందిన ఘనత పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి కి దక్కిందని, బెస్ట్ సూపరిండెంటంట్ కేటగిరిలో జిల్లా ఆసుపత్రి సూపరిండెంటంట్ డా క్టర్ శ్రీధర్ కు ఆరోగ్యశ్రీ కేసులలో రాష్ట్రంలో ప్రథమ స్థాయిలో నిలిచినందుకు మరో అవార్డు, టీ హబ్ ద్వారా అత్యధిక రక్త పరీక్షలు చేసినందుకు గాను మరో అవార్డు సొంతం కావడంతో ఈ అవార్డులను జిల్లా ఆసుపత్రి సూపరిండెంటంట్ డాక్టర్ కొండా శ్రీధర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. మోదర రాజనరసింహ  చేతుల మీదుగా మంగళవారం అందుకోవడం జరిగిందని, అలాగే రేడియా లజీడిపార్ట్మెంట్ తరపున ఎక్కువ స్కానింగ్స్ చేసినందుకు డాక్టర్ సంధ్యా రాణికి అవార్డు అందుకోనున్నారని, జిల్లా ఆసుపత్రికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కడం పట్ల జి ల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు సి బ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. 

జిల్లా ఆసుపత్రిలో సంవత్సరంలో 24 వేల మందికీ వైద్య సేవలు అం దించడం జరిగిందని, అందులో ఆర్తో పెడిక్ సర్జరీలు 780,  జనరల్ సర్జరీలు 1020, కం టి విభాగము సర్జరీలు 2520, చెవి, ముక్కు & గొంతు సర్జరీలు 360, డెంటల్ సర్జరీలు 4800, మొత్తం డెలివరీలు 2400, ఫిజియోథెరఫి 9600, ల్యాబ్ పరీక్షలు 3,60, 000, అల్ట్రా సౌండ్ స్కాన్లు 25200, ఇ సి జి 9600, 2 డి ఎకో 3060, X రే 24,000, టిఫ్ఫ స్కానింగ్ 1800, ఆరోగ్య శ్రీ సేవలు 3000, సూపర్ స్పెషాలిటీ సేవలు ఆర్తో స్కోపిక్ 4 ల్యాప్రోస్కోపిక్ గాల్ బ్లాడర్,  అ ప్పెండిక్స్ శస్త్రచికిత్సలు 40, యూరాలజీ శస్త్రచికిత్సలు 6, రూట్ కెనాల్ చికిత్సలు 130 న వజాత శిశువుల ఫెలోషిప్, 50కళ్లకు లేజర్ చికిత్స, 200 డయాలిసిస్ సేవలు 5400, ఇప్పటి వరకు 800 మందికి పైగా పుట్టిన పిల్లలకు నవ జాతి శిశు కేంద్రం ద్వార చికిత్స అందించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, పలు గ్రామా ల సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు.