ఏజెన్సీ ప్రాంత భూ సమస్యల పరిష్కారాని ప్రభుత్వం కట్టుబడి ఉంది
రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి
అచ్చంపేట ఏప్రిల్ 9 నల్లమల అటవీ ప్రాంత ఏజెన్సీ రైతుల భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కమిషన్ సభ్యులు మర్రి కంటి భవాని రెడ్డి, కేవిఎన్ రెడ్డి తోపాటు అమ్రాబాద్ మండలంలో ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి రైతుల భూ సమస్యలపై రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రైతుల భూమి హక్కులు, పత్రాల సమస్యలు, భూ వివాదాలపై నేరుగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకొని సీఎంతో చర్చించి పరిష్కార చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కా రానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రైతులకు బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కూడా నల్లమల్ల ప్రాంత రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని కమిషన్ను కోరారు. ఈ కార్యక్రమంలో రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, రాములు నాయక్, భూమి సునీల్ కుమార్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.




