03-12-2025 10:04:13 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో పదో తరగతి చదువుతున్న కే సింధు అంతర్జాతీయ వాలీబాల్ టీంకు కెప్టెన్ గా ఎంపికైంది. ఆమె ఇటీవల పూణేలో జరిగిన ఎస్ జి ఎఫ్ ఐ జాతీయస్థాయి వాలీబాల్ ఆటల పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. దీంతో ఆమె జాతీయస్థాయి వాలీబాల్ కెప్టెన్ గా ఎన్నికయింది. సింధూను అంతర్జాతీయ స్థాయిలో వాలిబాల్ ఆడేందుకు భారతదేశ వాలీబాల్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కే సంధ్యారాణి, సిబ్బంది ఆమెను అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదివి చదువుతోపాటు క్రీడల్లో రాణించినప్పుడే, పాఠశాలకు కళాశాల గుర్తింపు లభిస్తుందని అన్నారు.