24 April, 2026 | 1:27 AM

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

24-04-2026 12:08 AM

కోరమండల్ స్టేట్ ఆపరేషన్ హెడ్ రవికుమార్ 

శామీర్ పేట్,  ఏప్రిల్  23 ( విజయ క్రాంతి ): మహిళలు ఆర్థికంగా ఎదగలాని తెలంగాణ స్టేట్ కొరమండల్ ఆపరేషన్ హెడ్ రవికుమార్ అన్నారు. గురువారం శామీర్ పేట్ మన గ్రోమోర్ సెంటర్లోని కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైదరాబాద్ పట్టణంలో డివో మధ్య తరగతికి చెందిన టైలరింగ్ లో అనుభవం ఉండి, టైలరింగ్ గుత్తిని జీవనోపాధిగా మలుచుకున్న మహిళలకు  సెమీ ఇండస్ట్రియల్ కుట్టు మిషన్ ఉచితంగా అందించి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుందన్నారు. శామీర్ పేటలో 54 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కిషోర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.