28 May, 2026 | 2:23 AM

పెండింగ్ దరఖాస్తులను 15 రోజులలో పూర్తి చేయాలి

28-05-2026 01:49 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట, మే 27 (విజయక్రాంతి) : సాదా బైనమా, రెవిన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తులను, గ్రీవెన్స్ భూభారతి దరఖాస్తులు అన్నీ 15 రోజులలో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వి సి హాల్ నుండి జిల్లాలోని తాసిల్దార్లు, ఆర్డీవోలతో వెబ్‌ఎక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాదా బైనమా, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను అలాగే గ్రీవెన్స్, భూ భారతిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో పెట్టకుండా 15 రోజులలో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశిం చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి హరి సింగ్, ఈ సెక్షన్ సూపర్డెంట్ సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.