18 April, 2026 | 4:41 PM

చెక్కులు క్లియర్ చేయకపోతే... పనులు చేపట్టం

31-05-2025 08:25 PM

బోథ్,(విజయక్రాంతి): బోథ్ మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలో ఆర్థిక పరమైనటువంటి పనులను ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ, మోటార్ రిపేర్, వీధి దీపాల ఏర్పాటు, గడ్డి మందు కొనటం లాంటి పనులను జూన్ 1 తేదీ నుండి చేయబోమని  పంచాయతీ కార్యదర్శులు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఎంపీడీవో రమేష్ కు వినతిపత్రం ఇచ్చారు. గత  18 నెలలుగా గ్రామపంచాయతీల మెయింటెనెన్స్ కొరకు ఏలాంటి నిధులు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 2024 నుంచి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న చెక్కులు క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంవత్సరాల తరబడి నిధులు రాకపోతే  మెయింటెనెన్స్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇకనైనా ఉన్నతాధికారులు కల్పించుకొని  గ్రామ పంచాయతీల నిర్వహణ నిధులను విడుదల చేయాలని కోరారు.