13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి

24-03-2026 12:00 AM

జగిత్యాల, మార్చి 23 ( విజయక్రాంతి ) :పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని నిరసిస్తూ జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తాలో ఏ బి వి పి ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించగా విద్యార్థి నాయకులను విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్య సమితి సభ్యులు మల్యాల రాకేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందే విద్యార్థుల ఓట్లతో ఆనాడు ఎన్నికల ప్రచార సమయంలో ఆకాశమే హద్దుగా హామీలను ఇచ్చారు.

విద్యార్థి వ్యతిరేక పాలనను నేడు అమలు పరుస్తున్నారని,పేద బడుగు బలహీన విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లను పెండింగ్లో ఉంచి ఇష్టానుసారంగా ఫీజులు దండుకుంటూ పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అని ఆరోపించారు. స్కాలర్షిప్ సకాలంలో రాని కారణంగా డిగ్రీ, పీజీ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీలలో సైతం విద్యార్థుల దగ్గర నుండే ఫీజులు వసూలు చేసే దౌర్భాగ్యమైన స్థితికి దిగజార్చిందని,

విద్యావ్యవస్థను పూర్తిగా బ్రష్టు పట్టించిందని ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడిన మాటలు అన్నీ బూటకపూ మాటలేనని ఎద్దేవా చేశారు. విద్యారంగా ప్రమాణాలను పూర్తిగా ఖూనీ చేస్తూ కార్పొరేట్ వ్యవస్థను నిర్మించే విధంగా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని తెలిపారు.ఇది ప్రజా పాలన కాదు కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన విద్యార్థి జీవితాలను పైకి తీయలేని కార్పొరేట్ కమిషన్ల పాలనని అన్నారు.

నేడు అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్లో సైతం విద్యారంగాన్ని చిన్న చూపు చూస్తూ కేవలం 8 శాతం నిధులు కేటాయించడం సిగ్గుచేటని అలాగే కనీసం జాబ్ క్యాలెండర్, కొత్త కోర్సులకు సంబంధించిన విషయంలో స్కాలర్షిప్ ఫీజు నెంబర్స్ మెంట్ గురించి బట్టి విక్రమార్క మాట్లాడకపోవడం యావత్ విద్యార్థి లోకమంతా భయాందోళనలో నెట్టివేసిందన్నారు.

ఇకనైనా అసెంబ్లీలో విద్యారంగంపై చర్చించి సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసే విధంగా విద్యా వ్యవస్థను గాడిన పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుందారపు రాజు,రాపాక నిఖిల్, కార్యకర్తలు విశ్వ ప్రవీణ్,సౌమ్య, కావ్య,గంగా,శ్రీజ,తదితరులు పాల్గొన్నారు.