1 July, 2026 | 7:55 PM

Breaking News

ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •  

ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి

25-09-2024 12:33 AM

ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజీవో, టీఎన్జీవో, ఉద్యోగ, ఉపాధ్యాయ, ఫోర్త్ క్లాస్‌తో కలిపి మొత్తం 205  సంఘాలతో నిర్వహించిన సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు, అన్ని బిల్లులు క్లియర్ చేయాలని కోరారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పీఆర్సీ నివేదికను ప్రకటించి దాన్ని అమలు చేయాలని విన్నవించారు.