17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పెండింగ్ సమస్యలు వెంటనే పూర్తి చేయాలి: ఐఎన్టీయూసీ

27-05-2025 12:00 AM

బూర్గంపాడు, మే 26 (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం సారపాక లోని ఐటీసీ కర్మాగారంలో సోమవారం నాడు అన్ని షిఫ్ట్ లల్లో ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఐటీసీ పిఎస్పీడీపీ కర్మాగారంలో పెండింగ్ సమస్యలపై యాజమాన్యాన్ని, రికగ్నైసేడ్ యూనియన్ని ప్రశ్నిస్తూ గేటు మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోనె రామారావు యారం పిచ్చిరెడ్డి పాల్గొని మాట్లాడారు.

ఉద్యోగాల భర్తీ, పెండింగ్ లో ఉన్న ప్రొమోషన్ ప్రక్రియ,13వ వేతన ఒప్పందంలోని పెండింగ్ సమస్యలు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 13వ వేతన ఒప్పందం ఇన్ టైం అగ్రిమెంట్ అని చెప్పి ప్రస్తుత గుర్తింపు కార్మిక సంఘం వేతన ఒప్పంద కాలం 4 సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ ఒప్పందంలో రాసుకున్న సమస్యలు ఇప్పటికీ పరిష్కరించకపోవటానికి యాజమాన్యం గుర్తింపు సంఘం మధ్య చీకటి ఒప్పందాలే కారణమన్నారు.

అనంతరం ఐటిసి అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని గుర్తింపు సంఘానికి , యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలతో నిరసన తెలియజేశారు. కార్మికుల నివాసానికి నూతన క్వార్టర్స్ నిర్మాణం,

ప్రస్తుతం ఖాళీగా ఉన్న పాత క్వార్టర్స్ కి కౌన్సిలింగ్ చేసి కార్మికులకు ఇప్పించాలని పెండింగ్ సమస్యలు త్వరగా పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ టియూసి మిత్రపక్షాల నాయకులు, కార్యవర్గ సభ్యులు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.