19-01-2026 06:23:31 PM
బల్దియా ఎదుట కార్మికుల ధర్నా
కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): గత రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న పీఎఫ్ బకాయిలను తక్షణమే ఖాతాల్లో జమచేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన కార్మికుల స్థానంలో వారి కుటుంబసభ్యులను నియమించాలన్నారు. అకారణంగా విధులు నుండి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, సీఐటీయూ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు