19-01-2026 06:28:09 PM
రూ.15000 ఆర్థిక సహాయం
భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నేత కొండ ఉప్పలయ్య
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బురహాన్ పురం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన గ్రామ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు జాంపల్లి బాలరాజు కుటుంబానికి సంఘం అండగా ఉంటుందని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు)జిల్లా నాయకులు కొండ ఉప్పలయ్య తెలిపారు. సోమవారం బురహాను పురం గ్రామంలో ఆయన 10వ రోజు దశదినకర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అంతేగాక తోటి కార్మికులు ఆ కుటుంబానికి ఆర్థిక తోడ్పాటును అందించడానికి రూ:15000/- అందించి కుటుంబానికి భరోసాగా నిలిచారు.